రెడ్డి సామ వ్యవస్థాపక అధ్యక్షులు www.jaihomanthra.com "జైహో" విధానం మరియు "సాక్షీభూత ప్రతిస్పందనా చికిత్స విధానం" అభివృద్దిలో ఆర్. రెడ్డి సామ సాధనమై నిలిచారు. భారతదేశంలో 25 సంవత్సరాలు గడిపిన పిమ్మట వీరు అమెరికాలో 25 సంవత్సరాలకు పైగా ఉన్నారు. ఇటీవల "జైహో విధానం" పేరిట వ్యక్తులు, జట్లు, చిన్న పెద్ద సమూహాల మధ్య సామరస్య జీవనం, విలువల నడుమ సమతుల్యం సాధించే సమర్ధవంతమైన విధానాన్ని రెడ్డి అభివృద్ది చేసారు. SAMA సంయోజిత సారాంశపు నివేదిక. ఈయన అభివృద్ది చేసిన SAMA సంయోజిత నివేదికల్లో వైరుధ్యాలకు స్వస్థి పలికే మూడు విధానాలు ఉంటాయి. అవి "జైహో విధానం" ద్వారా నా మార్గం, నీ మార్గం, మన మార్గం. వీరు ఇల్లినాయిస్లోని షికాగోలో 40 సంవత్సరాలుగా భార్య కళ, కూతురు పద్మజ, కొడుకు ప్రదీప్, ముగ్గురు మనుమలు ఫిలిప్ .జూ (ఆనంద్), నాథన్ (ధర్మ) మరియు టెడ్దీ(ఆకాశ్) లతో నివసిస్తున్నారు.
Popular posts from this blog
ప్రపంచ సామరస్యం గత 30 సంవత్సరాలనుండి రెడ్డి సామా ఒక ఆధ్యాత్మిక ఉపన్యాసకులు. ధ్యానంలో లోతులకు వెళ్ళిన ఈయన అందులో ఎంతో సాధన చేసారు. తన జీవితంలో గత 7 సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సరికొత్త సవాళ్ళు, స్వయంసాక్షిగా నిలిచే ధ్యానం పై ఆయన చేసిన ప్రయోగాలు "జైహో విధానం" గా రూపు దిద్దుకున్నాయి. ఈ విధానంలో తాను కనుగొన్న విషయాలను, మనిషి తన వ్యక్తిగత బాధలనుండి విముక్తుడవ్వటమే కాక విశ్వసామరస్యానికి తోడ్పడే స్థాయికి ఎదగడానికి అవసరమయ్యే చక్కటి విధానాలను www.jaihomanhtra వెబ్సైట్లో పొందుపరిచారు. ప్రపంచ సామరస్యపు ప్రాజెక్టు ని సుసాధ్యం చేయడమే వీరి లక్ష్యం. సర్టిఫైడ్ CTT కన్సల్టెంటుగా ఉన్న రెడ్డి సామా తద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 4000 మంది CTT కన్సల్టెంట్లని నెట్వర్క్ చేయడం ద్వారా ప్రపంచ సామరస్యపు ప్రాజెక్టుని వ్యక్తులకు నేరుగా, చిన్న పెద్ద సమూహాలకు చేరువ చేయాలన్నది లక్ష్యంగా పని చేస్తున్నారు. పరస్పర ఉత్తేజంతో చక్కగా అమలు పరిస్తే ఈ విధానాల ద్వారా 2020 నాటికి ప్రపంచంలో చెప్పుకోదగిన స్థాయిలో చక్కటి సామరస్యం ఏర్పడుతుంది.
Comments
Post a Comment